మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా ఆయన చేసే పనులతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో ఒక కలెక్టర్తో అనుచితంగా ప్రవర్తించిన సమయంలో ఏకంగా శంకర్ నాయక్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది. ఇక ఇటీవలే ఏకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు.  అక్కడ ఉన్న వారందరికీ  ఆయన చేతి తో మద్యం తాగించారు.


 ఇది కూడా సంచలనం గానే  మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి ఎవరూ ఊహించని పని చేసి వార్తల్లో నిలిచాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. యాసంగి లో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని మెహబూబాబాద్ లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు  అయితే ఇక అక్కడ చేపట్టిన దీక్షలో పార్టీలోని వర్గ విభేదాలకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే వర్గ విభేదాలు బయటపడటం గమనార్హం.


 టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్ష లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలగజేసుకుని ముందు నేను మాట్లాడుతాను అంటూ అడిగారు నేను మాట్లాడుతున్నాను కదా అంటూ సమాధానం చెప్పింది ఎంపీ కవిత. అప్పటికే వినిపించుకోకుండా ఏకంగా ఎంపీ కవిత చేతిలోనుంచి శంకర్ నాయక్ నాయక్ మైక్ లాక్కున్నారు. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఇక ఇలా మైక్ లక్కోవటంతో ఎంపీ కవిత బిత్తరపోయారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: