
భారత్ లో వాక్సిన్ ఉత్పత్తి జరిగిన తరువాత ఇతర దేశాలలో ఆ పరిస్థితి నెలకొంది. అయినా ఎవరు కూడా తమకు దాచుకోకుండా లేదా తమకు తగినంత ఉత్పత్తి జరిగిన తరువాతే మిగిలిన వారికీ కేటాయించడం జరిగింది. కానీ భారత్ ఉన్న ఉత్పత్తిలోనే తన వాళ్లకు మరియు ఇతరులకు కేటాయిస్తూ రెండిటిని సమన్వయము చేస్తూ పోయింది. ఇదే భారత్ పై ప్రపంచంలో విశ్వాసాన్ని కలిగించడంలో ఎంతో ఉపకరించింది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేశం ఏదో మరోసారి ప్రపంచానికి తెలియవచ్చిందనే చెప్పాలి. ఒకస్థాయిలో భారత్ లో కూడా ఉత్పత్తి తగిన విధంగా లేకపోవడంతో ఆ సమస్యను కూడా పరిష్కరించుకొని ముందుకుపోయింది. ప్రస్తుతం దేశీయంగా కూడా 102 కోట్ల వాక్సిన్ పంపిణి చేసింది భారతప్రభుత్వం.
ఇక అంతర్జాతీయంగా భారత్ పంపిణి చేసిన వాక్సిన్ విషయానికి వస్తే, తాజా లెక్కలు ఇలా ఉన్నాయి. కామెరూన్ కు 80శాతం, పపువా న్యూ గినియా 68 శాతం, మాలి కి 68శాతం, సూడాన్ 55శాతం, ఇథియోపియా 54శాతం, భూటాన్ 51 శాతం, నైజీరియా 51 శాతం, సోమాలియా 47 శాతం, నైగర్ 47 శాతం, మాల్ దివ్స్ 42 శాతం, ఆఫ్ఘనిస్తాన్ కు 45శాతం, మయన్మార్ కు 38 శాతం, ఉగాండా 35 శాతం, నికరగోవా 34 శాతం, సిరియా కు 28 శాతం, మారిషస్ 23 శాతం, నేపాల్ 23 శాతం, కెన్యా కు 24 శాతం, బంగ్లాదేశ్ కు 20 శాతం భారత్ వాక్సిన్ పంపిణి చేసింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వీటిలో కొంత ఉచితంగా పంపిణి చేయగా, మరికొంత నగదుకు పంపిణి చేసింది. ఇలా భారత్ మరోసారి విశ్వగురువుగా ఉందనడానికి ఇదే సజీవ సాక్ష్యం.