
అసలే ఈ అంశం జాతీయ మీడియాలోనూ వచ్చింది. అంతేకాదు.. ఇప్పుడు ఏకంగా జాతీయ మహిళ కమిషన్ రంగంలోకి దిగింది. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. అంతేకాదు.. గోరంట్ల ఎంపీ కాబట్టి.. లోక్ సభ స్పీకర్‌కు కూడా జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరింది.
ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. ఒకవేళ జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సీరియస్‌గా తీసుకుంటే.. గోరంట్ల మాధవ్‌కు చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై స్వతంత్ర్య దర్యాప్తును కు ఆదేశించిన కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించినా గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
ఇక ఈ అంశాన్ని టీడీపీ కూడా ఒక పట్టాన వదలడం లేదు. జాతీయ మహిళ కమిషన్ కు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని లేఖలో అనిత వెల్లడించారు. ఎంపీ మాధవ్ వీడియోపై జాతీయ మహిళ కమిషన్ విచారణ జరపాలని అనిత కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో అనిత ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల వివరాలను లేఖకు జత చేసి మహిళా కమిషన్ ఛైర్ పర్సనుకు అనిత పంపారు.