నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలను  పాటించాలి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా నీరు త్రాగడం వల్ల  నోటి దుర్వాసన నుండి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నోరు పొడిగా అనిపించినప్పుడు నీటిని తాగడం వల్ల, నోట్లో చెడు బ్యాక్టీరియా అనేది పెరగకుండా ఉంటుంది. ఇక లాలాజలం మీ నోటిని శుభ్రంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.దంతాలు ఇంకా నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన తలెత్తే అవకాశం ఉంది. తరచూ నోరు పొడిబారడం, చిగుళ్ల సమస్యలు, దంతాల్లో క్యావిటీ, ఉల్లి ఇంకా అలాగే వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై పేరుకోవడం, డయాబెటిస్‌ ఇంకా అలాగే సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ధూమపానం, మద్యం, ఒత్తిడి, ఆందోళనలు కూడా నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు.


ఇక ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసన చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.అలాగే మీరు రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానికి తోడు టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను ఖచ్చితంగా వినియోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల ఎక్కువగా వస్తుంటుంది. వీలైనంత వరకు మన నోటిని పళ్లను చాలా శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.ఇక ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటిని ఖచ్చితంగా పుక్కిలించుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పుని వేసుకుని కలిపి.. దానిని రోజులో రెండు మూడు సార్లైనా ఖచ్చితంగా పుక్కిలించాలి. అది కూడా ఆహారం తీసుకున్న తరువాత ఇలా చేయడం వల్ల నోట్లో ఏదైనా ఆహారం మిగిలిపోయి ఉంటే నోరు ఖచ్చితంగా చాలా శుభ్రం అవుతుంది.ఇంకా అంతేకాదు నోటి దుర్వాసన కూడా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: