అల్లు అర్జున్ సినిమాలే కాదు పాటలు కూడా అభిమానులని ఎదురుచూసేలా చేస్తాయి. అల్లు అర్జున్ సినిమాలో కథ ఎంత ముఖ్యమో డాన్స్, సాంగ్స్ కూడా అంతే ముఖ్యం. గతేడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో వచ్చిన పాటలు ఇప్పటికి ఒక సంచలనమే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి లీక్ అయిన ఫొటోస్, ఫైట్ సీన్స్ సినిమాపై అంచనాలని మరింత పెంచాయి. పుష్ప రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సినిమా నుండి మొదటి పాట వచ్చి అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరో అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఇక రెండవ పాట కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది బన్నీ.. రష్మికల మద్య సాగే ఒక లవ్ కమ్ రొమాంటిక్ సాంగ్ అని టాక్ నడుస్తుంది.

అయితే పుష్ప నుంచి వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ బుట్ట బొమ్మ సాంగ్ లానే ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పుష్ప సినిమాలో అడివిలో మాస్ గా ఉండే అల్లు అర్జున్ కి లవ్ సాంగ్ ఎక్కడ, ఎలా వస్తుంది అనేది ఇంకా ఆసక్తి పెంచుతుంది. అయితే ఈ సాంగ్ కోసం దేవి శ్రీ, సుకుమార్ స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. బన్నీ స్టెప్స్ కి దేవి శ్రీ మ్యూజిక్ యాడ్ అయితే మరోసారి మ్యాజిక్ జరిగె ఛాన్స్ ఉంది. మొదటి సాంగ్ ఐదు భాషల్లో మంచి వ్యూస్ సాధించింది. అయితే ఇప్పుడు వచ్చే సాంగ్ ని కూడా ఐదు భాషల్లో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాలని చూస్తున్నారు, 

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ది బెస్ట్ మ్యూజిక్ కంబినేషన్. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇప్పటి వరకు వీరి మధ్య వచ్చినవి అన్ని మ్యూజికల్ గా సక్సెస్ ను దక్కించుకున్నాయి. దీంతో ఇప్పడు ఈ పాటపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. మొదటి సాంగ్ మాస్ అభిమానులను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: