పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ మరి కొన్ని మూవీ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది ఇలా అంటే ప్రస్తుతం వరస మూవీ కమిట్ మెంట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో టెలికాస్ట్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు గెస్ట్ గా రావడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇద్దరు కలిసి అన్ స్టాపబుల్ టాక్ షో కి ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందా ... ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా ... అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అన్ స్టాపబుల్ టాక్ షో ఫుల్ జోష్ లో ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: