
ఇక ఈ రచ్చ ఉత్తరాంధ్రలో ఎక్కువ జరుగుతుందని తెలుస్తోంది...ఫ్యాన్ పార్టీ నేతలే..సొంత పార్టీని ముంచేలా ఉన్నారు. ఉదాహరణకు ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే గళం విప్పుతున్నారు. అసలు బాబూరావు వల్లే పాయకరావుపేటలో పార్టీ నాశనమవుతుందని చెబుతున్నారు. ఈ రచ్చ ఒక్క పాయకరావుపేటకే పరిమితం కాలేదు. ఇంకా చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది.
ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబురాజుకు, వైసీపీ నేత ఆడారి ఆనంద్‌ల మధ్య విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అటు గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పూర్తిగా సైడ్ అయిపోయి, తన వారసులకు పెత్తనం ఇచ్చేశారు...దీంతో గాజువాకలో కొందరు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అటు పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ వైఖరిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేసే పరిస్తితి.
అటు సాలూరులో ఎమ్మెల్యే రాజన్న దొరకు, జెడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీనుకు పెద్దగా పడటం లేదని తెలుస్తోంది. ఇటు కురుపాంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణికి వ్యతిరేకంగా సొంత మామ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. అటు శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాంలకు సెపరేట్ గ్రూపులు ఉన్నాయని తెలుస్తోంది. మూడు గ్రూపుల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇలా ఎక్కడకక్కడ ఫ్యాన్‌లో ఫ్యాన్స్ వార్ పెరిగిపోయింది.