రోజాపై మండిపడుతున్న సూపర్ స్టార్ అభిమానులు?

తమిళనాడులో ఏపీ మంత్రి రోజా ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌ వార్ చాలా నడుస్తోంది. రజినీకాంత్‌ విషయంలో రోజా పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌పై రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.రజినీకాంత్‌ గురించి ప్రశ్న అడిగితే రోజా వెక్కిరించారని ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మంత్రి రోజా చూపిన హావభావాలకు క్షమాపణ చెప్పాలని రజినీకాంత్ ఫ్యాన్స్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది తమిళనాడులోని తిరుచెందూర్‌లో జరిగింది. అక్కడి మురగన్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్లిన రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గతంలో ఏపీకి వచ్చిన రజినీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ ని ప్రశంశించారు. అలాగే చంద్రబాబును కూడా ఆకాశానికెత్తారు. ఆ ప్రశంసలపై వైసీపీ ప్రభుత్వం ఎంతగానో మండిపడింది. చంద్రబాబు విజనరీ ఉన్న నేత అంటూ రజినీకాంత్‌ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. 


తమిళనాడులో అడుగుపెట్టిన రోజాను అక్కడి మీడియా కూడా ఇలాంటి ప్రశ్నలు వేసింది. అందుకు రోజా మాత్రం విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ని ఇచ్చారు. రజనీ గురించి అడిగిన ప్రశ్నకు రోజా సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్న నుండి తప్పించుకుంటూ రియాక్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన రజినీకాంత్ అభిమానులు రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఆర్ తనయుడు బాలకృష్ణ ఇంకా అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ వైభవం గురించి మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్, చంద్రబాబు నాయుడు-బాలకృష్ణ వైభవం గురించి కూడా చాలా మాట్లాడారు.రజినీకాంత్ మాటలని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇంకా ఈ వివాదం అనేది ఎంత దూరం దాకా వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: