మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ ఘోర పరాజయం తర్వాత టీడీపీ  కీలక నేతల  అందరి చూపులు పక్క పార్టీల వైపు మళ్లుతున్నాయి .ఇప్పటికే  టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొంత మంది నేతలు కూడా వైసిపి బీజేపీ పార్టీల వైపు చూస్తున్నాయి. ఇక తాజాగా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయడంతో  చంద్రబాబుకు బిగ్ షాక్ తగలడమే కాదు  ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ ను  జూనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేంతవరకు టిడిపి బాగుపడదని... నారా లోకేష్ ను  చంద్రబాబు పార్టీ నేతలపైనా బలవంతంగా రుద్దెందుకు  ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

 

 అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ ను పోలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు నారా లోకేష్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ విమర్శలు చేసారు వల్లభనేని వంశీ. అయితే తాజాగా వైసీపీ నేత ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను  పోలుస్తూ లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు.. నారా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ 100 రేట్లు బెటర్ అంటూ లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించిన కలిగే నటన వాక్చాతుర్యం ఉన్నాయని సబ్జెక్టు మీద ఆయనకు మంచి పట్టు ఉంది అంటూ లక్ష్మీపార్వతి అన్నారు. లోకేష్ కి ఏ విషయం పైనా అవగాహన లేదని... స్క్రిప్ట్ లో  రాసింది కూడా ఏం చదవాలో కూడా తెలియని వ్యక్తి లొకేష్ అంటూ  లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. 

 

 

 

 అయితే గతంలో 2009 ఎన్నికలు టిడిపి అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాల్లో తన ఇమేజ్ ని పక్కనపెట్టి ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ 2009 ఎన్నికల్లో టిడిపి మాత్రం గెలవలేక పోయింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరం పెట్టి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇక మొన్నటికి మొన్న తన అక్క సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు . ఇదిలా ఉండగా టిడిపి పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకీ వస్తేనే  టిడిపికి పునర్వైభవం వస్తుందని లేకపోతే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: