
కేంద్ర కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహిస్తున్న వారు కూడా ఈ మధ్యకాలంలో పార్టీ మీద దృష్టి పెట్టకపోవడం సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం సొంత సొంత నియోజకవర్గాల్లో వ్యాపారాలు ఎక్కువగా చేసుకోవడం అనేది కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం. చాలా నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సహకరించడం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు కు ఎటువంటి సలహాలు ఇవ్వకుండానే కొంతమంది సీనియర్ కేంద్ర మంత్రులు సమయం గడుపుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి.
అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొంత మంది కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా చర్చలు జరిపారని అదేవిధంగా మిత్రపక్షాలకు కేబినెట్ లో అవకాశం కల్పించేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏవిధంగా మారబోతున్నాయి ఎటువంటి మలుపు తిరగబోతున్నాయి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కాస్త మోడీ సీరియస్ గానే కష్టపడుతున్నారని సమాచారం.