కరోనా తో ప్రపంచ దేశాల్లో ఎంతో  మంది మరణించడానికి కారణం చైనాలో ని వుహన్ ల్యాబే అని చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి. చైనాలో ఆ ల్యాబ్ లో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మాత్రం ఆ దేశం ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. కానీ అమెరికాలో ని అంటు వ్యాధుల నిపుణుడు అంటోని పౌచీ సహచరుడు డాక్టర్ రాబర్ట్ సంచలన విషయాలు బయటపెట్టాడు.


ప్రముఖమైన విషయం ఏంటంటే 2009 సంవత్సరం నుంచే వుహన్ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయి. వుహన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ లీకైందని మూడు సాక్ష్యాలను చెప్పాడు. ఏదైనా పరిశోధన అంశం గురించి ప్రతి ఒక్క అంశాన్ని మొదటి నుంచి రాస్తారు. దీన్ని చైనాలోని వుహన్ ల్యాబ్ డిలేట్ చేసింది. రెండో అంశం  శాస్త్రవేత్తలను అందరినీ లోపల ఉంచి కమాండ్ కంట్రోల్ ను చైనా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. మూడోది కాంట్రాక్టర్ ను పెట్టి ల్యాబ్ లో లీకైన వైరస్ గాల్లోకి వెళ్లిపోయేలా పైకి వెంటిలేటర్ ను అమర్చారు. అది కాస్త పక్కనే ఉండే వుహన్ మార్కెట్లో గాల్లోకి చేరింది.


ఇక అక్కడ నుంచి అసలైన కరోనా మొదలైందని దాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదని చెప్పుకొచ్చారు. ఇదంతా 2019 సెప్టెంబర్ నెలలో జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగాల్లో అమెరికా ముందునుంచి ఉండేదని ట్రంపు సర్కారు వచ్చిన తర్వాత జీవాయుధాలను తయారు చేసే పరిశోధన నుంచి అగ్రరాజ్యం తప్పుకుందని అన్నారు. అనంతరం చైనాకు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలకు ఏమీ చేయాలో తెలియక కరోనా వైరస్ లీకైందన్నారు.


జీవాయుధాలు అంటే ఒక దేశంపై బాంబు వేస్తే జరిగే నష్టం కన్నా 100 రేట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. బాంబుతో ఒకేసారి చనిపోతారు. జీవాయుధం వేసిన ప్రాంతంలో ఉన్న మనుషులు రోగాల బారిన పడి కుంగి కుశించి పోతారు.  ఆయా ప్రాంతాల్లో తమ సామ్రాజ్యం స్థాపించాలన్నది రెండు దేశాల భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: