
టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్‌గా హీరో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన బన్నీ.. ఆ సక్సెస్‌ను ఎంజాయి చేస్తున్నారు. అయితే బన్నీ మంచి హీరోతోపాటు మంచి ఫ్యామిలీ పర్సన్. తన కుటుంబం అంటే తనకెంతో ఇష్టం. అల్లు అర్జున్ జోడి టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో అల్లు అర్జున్-స్నేహ రెడ్డికి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎంతో అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు. అలాగే తమ వైవాహిక జీవితం గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇస్తుంటారు. అలా తమ అభిమానులకు రిలేషన్‌షిప్ పాఠాలను నేర్పిస్తుంటారు. అయితే అల్లు అర్జున్ భార్య కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్నేహ రెడ్డి.. తన కూతురు, కొడుకు ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేసిన పోస్టులకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. దీంతో స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఏ స్టార్ హీరోయిన్‌కి లేని ఫ్యాన్ ఫాలొయింగ్ స్నేహ రెడ్డికి ఉండటం ప్రత్యేకం. అలా స్నేహ రెడ్డికి కొంచెం ఖాళీ సమయం దొరికినా.. అభిమానులతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం అలవాటు. తాజాగా సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సెషన్‌లో అభిమానులు అడిగిన చాలా వరకు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ బన్నీ గురించి ప్రశ్నలు వేశారు. బన్నీకి ఏ కలర్ ఇష్టమని, ఎలాంటి ఫుడ్ ఇష్టమని, మీరు ఎక్కువగా వెళ్లే టూరిస్ట్ ప్లేస్ ఎక్కడని అడిగాడు. దీనికి స్నేహరెడ్డి స్పందిస్తూ.. బన్నీకి ఎక్కువగా బిర్యానీ ఇష్టమని తెలిపింది. అలాగే తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, తీరిక దొరికినప్పుడల్లా లండన్‌కు టూర్ వెళ్తామని ఆమె వెల్లడించారు. దీంతో బన్నీ గురించి స్నేహ రెడ్డి చెప్పిన మాటలు ఎంతో వైరల్ అయ్యాయి. బన్నీ కూడా బిర్యానీ లవరేనని కామెంట్లు పెడుతున్నారు.