చిన్న సినిమాగా విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఊహించిన విధంగా అవార్డ్ లు గెలుచుకున్న బలగం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఈ సినిమా ఇప్పటివరకు బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా, మూవీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ,బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా పలు రకాల అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబ సభ్యులు భావోద్వేగాలు బంధాలు అనుబంధాలు నేపథ్యంలో కమెడియన్ వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శికి ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సైతం వచ్చింది. 

ఇక ఈ అవార్డుని సొంతం చేసుకోవడంతో ఎంతో ఆనందంగా ఉన్నాడు ప్రియదర్శి. అదృష్టవశాత్తు హీరో ఆఫర్ మరో హీరో నుండి ప్రియదర్శికి వచ్చిందట. లేదంటే ముందుగా ఈ సినిమా కోసం హీరోగా అనుకున్నా హీరోకే ఈ అవార్డు దక్కేది. ఇక ఆయన మరెవరో కాదు. విభిన్న కథలను ఎంచుకోండి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు. మొదట ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం శ్రీ విష్ణునే అనుకున్నారట చిత్ర బృందం. ఇకపోతే ఆంధ్ర నేపథ్యం ఉన్న ఆయన తెలంగాణ యాసలో అంతా పర్ఫెక్ట్ గా మాట్లాడలేడు అన్న ఉద్దేశం తో ఈ సినిమాలో ప్రియదర్శిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రియదర్శి తెలంగాణ యాస ఇరగదీస్తాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే .ఒకవేళ శ్రీ విష్ణు ఈ సినిమా చేసి ఉంటే కచ్చితంగా కమర్షియల్ మార్కెట్ సైతం యాడ్ అయ్యేదని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోవడంతో ఆ లోటు కూడా తీరిపోయింది. ఇకపోతే ఈ సినిమా పెద్ద ప్రొడక్షన్ హౌస్ కు వెళ్లకముందే సాయిలు పాత్రలో తానే నటిద్దామని అనుకున్నాడట డైరెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ కి ప్రియదర్శి బాగుంటాడని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. మొత్తంగా ఈ సినిమాలో మొదట హీరోగా చేద్దామని అనుకొని చివరికి నర్సి అనే ఒక చిన్న కామెడీ పాత్రలో మెరిసాడు వేణు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: