అడిగిన వెంటనే వరాలు ఇచ్చే ఆది దేవుడుగా కొలువబడుచున్న పరమేశ్వరుడు నంద్యాల చుట్టు నవనందుల రూపంలో దర్శనమిస్తూ, భక్తుల జన్మ జన్మల పాపాలను తుడచి వేస్తున్నాడు. కార్తీక మాస పర్వదినాలు శివునికి పరమ పవిత్రం అయినవి కావడంతో ఈ మాసంలో మనస్పూర్తిగా దేవతలను ఆరాధించినా.. ప్రతి ఒక్కరి కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

 

రాయలసీమలోని కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతములో నంద్యాల నుండి మహానంది పోవు రోడ్డు మార్గములో రోడ్డుకు ఇరువైపులా నవ అనగా.. తొమ్మిది నందులు కలవు. ఈ నవనందులును ఒకే రోజున సూర్యోదయమునుండి సూర్యాస్తమయం లోపుగా దర్శించుకొన్నట్లయిన కాశీ వెళ్ళి విశ్వేశ్వరరుని దర్శించుకొన్న ఫలితం వస్తుందని నానుడి. ఈ నవనందులలో నంద్యాల పట్టణమునందు 3 మహానంది నందు 3 మధ్యమార్గంలో 3 నందులు ఉన్నాయి. 

 

ఈ నవనందులలో శివ నంది మరియు సూర్య నంది లింగరూపములో ఉంటాయి. మిగిలిన నందులు లింగరూపంలో కాకుండా మూపురం ఆకారంలో ఉంటాయి. దీనికి ఒక కధ ప్రాచుర్యములో ఉంది. పూర్వము ఒక ఆవులు మెపే కాపరి రోజూ నల్లమల ఆటవీ ప్రాంతములో ఆవులు మేపుకొనేవాడట. ఆ ఆవులలో ఒక ఆవు పాలు ఇచ్చేదికాదట. ఎందువలన   ఇవ్వటం లేదని ఒక రోజు ఆ ఆవును వెంబడించగా అది ఒక పుట్టపై నిల్చొని పాలు పుట్టలో వదులుతూ   కనపడిందట. యజమానిని చూచి కంగారుగా ఆ పుట్టపై కాలువేసి పారిపోయినదట. ఆగిట్ట ఆనమాలు పుట్టలో ఉన్న లింగంపై పడిందట. అందువలననే నవనందులలో 7 నందులపై గిట్ట ఆనమాలు ఉంటుందట. 

 

శివనంది అతి పురాతనమైనది. ప్రశస్తమైన రాతి కట్టడము. చాలా హుందాగా ఉంటుంది. ఈదేవస్థానం పూజారి శ్రీదేవగుడి భవానీ శివశంకర్ శర్మ తెలిపిన వివరాలప్రకారం గుడిగోపురం లోపలివైపున ఒక రంద్రము ఉంది. ఆరంద్రము వద్దనే పంచముఖ నాగేంద్రుని బొమ్మఉంటుంది. ప్రతి శివరాత్రికి అర్ధరాత్రి 12 గంటలకి ఆలయంలో హడావుడి నిలుపుదల చేస్తారని, ఆ సమయంలో ఆ రంద్రము ద్వారా అయిదు తలల నాగేంద్రుడు లోపలికి వస్తాడని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: