టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు -2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.జూన్‌ నెల లాస్ట్‌వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన బిచ్చగాడు -2 కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో పదిహేను కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ మిగిల్చింది.తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా మొత్తం 45 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ వసూళ్లలో ఎక్కువ భాగం తెలుగు స్టేట్స్ నుంచే రావడం గమనార్హం. అయితే బిచ్చగాడు 2 డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమా జూన్ 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది.బిచ్చగాడు 2 సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.ఇక ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.


తొలి ప్రయత్నంలోనే మంచి లాభాలతో ఘన విజయాన్ని అందుకున్నాడు.ఇక విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) అనే వ్యక్తి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగా చెలామణి అవుతోంటాడు. అతడి ఆస్తిపై కన్నేసిన శత్రువులు బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా సత్య (విజయ్ ఆంటోనీ) అనే బిచ్చగాడి మెదడును విజయ్ గురుమూర్తి బ్రెయిన్‌లో ఫిక్స్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? బిచ్చగాళ్ల కోసం విజయ్ గురుమూర్తి ప్రవేశపెట్టిన యాంటీ బికిలీ పథకాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలని చూసిందన్నదే ఈ మూవీ కథ. మొదటి సినిమాతోనే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకొని సినిమా చేసి దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నాడు విజయ్ ఆంటోనీ. మొత్తానికి ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నాడు విజయ్ ఆంటోనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: