ప్రస్తుతం చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు అనేవి మన అదృష్టం పైన ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి బెడిసి కొట్టింది అంటే పెట్టిన డబ్బుతో సహా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. మరికొన్ని మల్టీబ్యాగర్ స్టాక్ మార్కెట్లు మాత్రం తప్పకుండా ఇన్వెస్టర్లకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు తమ షేర్లను లిస్టు చేశాయి.. ఇక ఈ షేర్ లలో చాలామందిని ఆకర్షించేవి కేవలం పెన్నీ స్టాక్స్ మాత్రమే ఇవి తక్కువ ధరకు లభించి ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి.. రిస్క్ ఉండదు పైగా మంచి రాబడి కూడా పొందవచ్చు.

ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే స్టాక్ విషయానికి వస్తే కెమికల్ రంగంలోని పెన్నీ మల్టీ బ్యాగర్ స్టాక్. ఈ రంగంలో ఫినోటెక్స్ కెమికల్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా మారుస్తున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెట్టుబడిన కొనసాగించిన వారు ప్రస్తుతం కోటీశ్వరులు కూడా అవుతున్నారు. గతంలో ఒక్కొక్క షేర్ ధర రెండు రూపాయల వద్ద ఉన్న ఈ పెన్ని స్టాకు పదేళ్ల తర్వాత ఇన్వెస్టర్లకు ఏకంగా 10,837 శాతం పెరిగి భారీ ఆదాయాన్ని అందించింది. ఆ సమయంలో ఎవరైనా కనీసం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే వారు ఇప్పుడు కచ్చితంగా కోటీశ్వరులు అయిపోయేవారు.

ఇకపోతే ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ షేర్ విలువ రూ.256 వద్ద కొనసాగుతోంది.. ఇకపోతే ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వారి సంపద ఏకంగా రూ.1.28కోట్లకు చేరి ఉండేది. మరొకవైపు కంపెనీ మార్కెట్ క్యాప్ 26 కోట్లుగా ఉండగా అందులో కంపెనీ షేర్లలో ప్రమోటర్లు 65.03% వాటాను కలిగి ఉంటే మిగతా 34.97% వాటా సాధారణ ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు. అంటే కేవలం గడిచిన మూడేళ్లలోనే ఈ కంపెనీ షేర్ విలువ సుమారుగా 1300 శాతం మేర పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: