
జగన్ నిర్ణయం ఆనం రామనారాయణ రెడ్డి కి సంతోషాన్ని ఇచ్చింది అదేమిటంటే ఆనం ను వెంకటగిరి నియోజక వర్గం సమన్వయ కర్తగా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. అయితే జగన్ ఆనం కు చంద్ర బాబు మాదిరిగా హ్యాండ్ ఇవ్వకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజక వర్గాన్ని ఇచ్చాడు. ఈ సీటు కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో హాట్ సీటుగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆనంతో పాటు పలువురు పోటీ పడటమే అందుకు ప్రధాన కారణం.
ఎప్పుడైతే తెలుగుదేశంపార్టీలో నుండి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారో ఆనం కుటుంబానికి వైసిపి ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనబడింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు, బిజెపి నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా వైసిపిలో చేరాలనుకున్నారు. అయితే ఇద్దరికీ వెంకటగిరిపైనే కన్నుంది. వీరిద్దరు కాకుండా జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు కూడా ఇదే సీటుపై కన్నేశారు. దాంతో వెంకటగిరి నియోజకవర్గం జిల్లా మొత్తం మీద హాట్ సీట్లైపోయింది.
ఆనం, నేదురుమల్లి ఇద్దరూ వైసిపిలో చేరటం ఖాయమైన తర్వాత జగన్ ఇద్దరితోను విడివిడిగా చర్చలు జరిపారు. పాదయత్రలో విశాఖపట్నం జిల్లాలో ఉన్నపుడు ఇద్దరు నేతలు వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఇద్దరిలో ఎవరికి వెంకటగిరిలో పోటీ చేసే అవకాశం వస్తుందో అన్న ఆతృత నేపధ్యంలో నేదురుమల్లికి వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ సీటు కానీ లేకపోతే ఎంఎల్సీ సీటు కానీ జగన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం మొదలైంది. దాంతో ఆనంకు లైన్ క్లియరైనట్లే సిగ్నల్ బయటకొచ్చాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆనంను వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు ఇవ్వటంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేయబోయేది ఆనం రామనారాయణరెడ్డే అంటూ ఆయన మద్దతుదారులు పండుగ చేసుకుంటున్నారు.