
ఇకపోతే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా జట్టులో భాగం అయ్యాడు. కానీ వరల్డ్ కప్ దృశ్య మరి కొన్ని రోజుల్లో భారత పర్యటనకు రాబోతున్న సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టి20 సిరీస్ కు మాత్రం హార్థిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తోందట.
అంతేకాకుండా అటు సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్‌లో కీలక మార్కులు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని క్రిక్‌బజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సౌత్ ఆఫ్రికా తో సిరీస్ ఎంపికైన సీనియర్ బౌలర్ షమి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోని అతను ఇంకా కోలుకోలేదని అతని స్థానంలో ఉమేష్ యాదవ్ కంటిన్యూ అవుతాడు అంటూ క్రిక్‌బజ్ పేర్కొంది. ఇక దీపక్ హుడాకు గాయం కావడంతో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తాడు అంటూ తెలిపింది. ఇలా పలు మార్పులతో సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టి20 సిరీస్ లో బరిలోకి దిగనుంది టీమిండియా.