బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ ప్రస్తుతం పటాన్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో షారుక్ ఖాన్ సరసన మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ లో దీపికా పదుకొనే అంద చందాలు ,  షారుక్ ఖాన్ ఖండాలు తిరిగిన బాడీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దానితో ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ పై ప్రస్తుతం తీవ్రమైన అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. అందులో భాగంగా పఠాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటూ ఓ నెటిజన్ షారుక్ ఖాన్ ను ప్రశ్నించాడు. దానితో షారుఖ్ ఖాన్ నేను జ్యోతిష్యుడిని కాదు అని , ఎంటర్టైన్ చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: