సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2023 ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంది. ఏ మ్యాచ్ లో గెలుస్తుందో ఏ మ్యాచ్ లో ఓడిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరుపై అటు సొంత అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2023 ఐపీఎల్ సీజన్ మినీ వేలంలో జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకొని అనూహ్యమైన మార్పులు చేసిన.. జట్టుకు అదృష్టం మాత్రం ఎక్కడ కలిసి రావడం లేదు.


 ఏకంగా కెప్టెన్ గా మార్కరమ్ ను నియమించిన కూడా జట్టు ఆటతీరులో మార్పు రావడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హరి బ్రూక్స్ డకౌట్ ప్లేయర్ గా మారిపోయాడు. ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం అటు భారీ టార్గెట్ ను చేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఈ విక్టరీని అటు సన్రైజర్స్ అభిమానులు కూడా నమ్మలేకపోయారు. నిజంగానే సన్రైజర్స్ 200 కు పైగా స్కోర్ చేదించి విజయం సాధించిందా అని కాసేపు షాక్ లో ఉండిపోయారు.


 అయితే సన్రైజర్స్ ఓటమి ఖాయం అనుకున్న సమయంలో క్రీజు లోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతను క్రీజ్ లో ఉన్నది తక్కువ సేపే అయిన మ్యాచ్ మొత్తాన్ని సన్రైజర్ పైపు తిప్పేసాడు. దీంతో ఇక ఆ తర్వాత అలవోకగా విజయం సాధించింది సన్రైజర్స్. అయితే అతని ఆట తీరు చూసిన తర్వాత ఇలాంటి ఆణిముత్యాన్ని పక్కనపెట్టి ఇన్నాళ్లు సన్రైజర్స్ హ్యారి బ్రూక్స్ అనే డక్ అవుట్ ప్లేయర్ మీద ఆధారపడిందా. ఇంతకీ అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటూ ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl