సమంత.. ఒక టాలెంటెడ్ హీరోయిన్ . అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ . ఇలా ఎలా మాట్లాడుకున్నా తప్పులేదు.  సమంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే విషయం అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా విడాకులు తర్వాత ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు . అసభ్యకర పదాజాలంతో దూషించారు . కానీ సమంత మాత్రం పెద్దగా పట్టించుకోలేదు . తన పని తాను చేసుకుంటూ పోయింది. విడాకుల తరువాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది . త్వరలోనే రాజ్  నిడమూరుతీ కొత్త బంధాన్ని ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


కాగా ఇదే మూమెంట్లో సమంతకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  సమంత ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమై ఉండేది అనే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు . గతంలో పో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత ముందు నుంచి తాను హీరోయిన్ అవ్వాలి అని అనుకోలేదు అని .. అలా సెట్ అయింది అని.. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ రంగంలో సెటిలై ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారట . దానికి సంబంధించిన వార్త మరొకసారి ట్రెండ్ అవుతుంది.



కాగా సమంత ఒక పక్క సినిమాలలో నటిస్తూనే "సాకీ" అనే బిజినెస్ ని స్టార్ట్ చేసింది . దాని ద్వారా మంచి లాభాలు కూడా అందుకుంటుంది . సినీ రంగంలో ఉన్నా కూడా తన కలను ఆమె సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. సమంతని చాలామంది అమ్మాయిలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు . త్వరలోనే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక వెబ్ సిరీస్ లో ఆమె భాగం కాబోతుందట . తెలుగులో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో ఆమె తన పేరుకి మళ్ళీ పునర్వైభవం అందించుకోబోతుంది అంటున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: