రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే ఉంది. అయితే ఈ సూచనలను నరేంద్రమోడీ పట్టించుకోవటంలేదు. పోయేకాలమొస్తే వినబడదు, కనబడదు అని పెద్దలు అంటుంటారు. అది బీజేపీ విషయంలో నిజమయ్యేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే మహిళా రెజర్లు దాదాపు నెలరోజులకు పైగా తమ సమస్యలపై దీక్షలు చేస్తుంటే మోడీకి చీమకుట్టినట్లు కూడా అనిపించటంలేదు. విచిత్రం ఏమిటంటే దేశంలో ఏదో మారుమూల ప్రాంతాల్లో తమ హక్కుల కోసం గోలచేస్తున్న వాళ్ళలాగేనే మహిళా రెజర్లను మోడీ జమకట్టినట్లున్నారు.





ఇంతకీ వీళ్ళ గోల ఏమిటంటే రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ మోహన్ సింగ్ శరణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడట. ఆయన మీద వెంటనే విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలనే డిమాండుతో వీళ్ళంతా దీక్షలు చేస్తున్నారు. నెలరోజులకు పైగా వీళ్ళు దీక్షలుచేస్తున్నా కేంద్రప్రభుత్వం నుండి ఎలాంటి స్పందనాలేదు. కారణం ఏమిటంటే బ్రిజ్ మోహన్ బీజేపీ ఎంపీ కూడా కావటమే. బహుశా బ్రిజ్ కు మోడీ స్ధాయిలో మంచి పలుకుబడున్నట్లు ఉంది. అందుకనే మహిళా రెజర్లు ఎంతగోలచేస్తున్నా మోడీ పట్టించుకోవటమే లేదు.





చివరకు వీళ్ళగోల ఎంతదాకా వచ్చిందంటే జాతీయ, అంతర్జాతీయస్ధాయిలో తాము కష్టపడి సాధించిన మెడల్సన్నింటినీ హరిద్వారలోని గంగానదిలోకలిపేస్తామని వార్నింగ్ ఇచ్చేంతదాక. రెజర్లు గనుక తమ మెడల్స్ ను గంగానదిలో కలిపేస్తే పోయేది దేశంపరువే అన్న విషయం అందరికీ తెలిసిందే. మెడల్స్ సంపాదించినపుడు వీళ్ళను అభినందించి, ఫొటోలకు ఫోజులిచ్చే మోడీ ఇపుడు వీళ్ళ ఆందోళనను మాత్రం పట్టించుకోవటంలేదు.





ఇపుడు సమస్య ఏమవుతుందోంటే రెజర్లలో ఎక్కువగా పంజాబ్, హర్యానాకు చెందిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళకు మద్దతుగా పై రాష్ట్రాల్లోని రైతుసంఘాలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే రైతుసంఘాలు రంగంలోకి దిగాయో వెంటనే రాజకీయపార్టీలు కూడా యాక్టివ్ అయిపోతాయి. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రెజర్లకు మద్దతు ప్రకటించారు. చిన్నగా మొదలైన ఆందోళన చివరకు ప్రభుత్వాన్ని పట్టికుదిపేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అసలు రాబోయేదంతా ఎన్నికల సంవత్సరమే. ఏదో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అంతిమంగా పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబ్టటి బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: