
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో విజయవంతంగా ముందుకు సాగడానికి అటు గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. ఆశిష్ నెహ్రా ఇచ్చిన సలహాలు సూచనలతోనే గుజరాత్ ఆటగాళ్లు ఎంతో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. జట్టును విజయతీరాలకు నడిపించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆశిష్ నెహ్రా కూడా కోచ్ వ్యవహరిస్తూ ఐపీఎల్ టైటిల్ అందించిన మొదటి ఇండియా ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ లోనే అత్యుత్తమ కోచ్ అంటూ ప్రశంసలు కురిపించాడు గుజరాత్ మెంటార్ కిర్ స్టన్. ఆశిష్ నెహ్రా కోచ్గా మనసు పెట్టి పని చేస్తాడు. తన ఆట గురించి ఏ విధంగా సహాయం చేయాలి అనే దాని గురించి ఎప్పుడు కాస్త ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వ్యూహాల పరంగా ఐపీఎల్లో అత్యుత్తమ కోచ్ లలో అతను ఒకడు. ప్రతి ఒక ఆటగాడు మంచి ప్రదర్శన చేసేలా ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తూనే ఉంటాడు ఆశిష్ నెహ్రా. కానీ ఎప్పుడూ ప్రచారం కోరుకోడు తెరవెనుక ఉండి సపోర్ట్ చేస్తాడంటూ గుజరాత్ మెంటర్ కిర్ స్టన్ ప్రశంసలు కురిపించాడు.