
ఎన్డీఏలో.. బిజేపి, జేడీయూ, హిందుస్థానీ అవామీ మోర్చా, వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ ఉన్నాయి. బిజేపితో సన్నిహితంగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగింది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి.243 సీట్లకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 28న తొలిదశ పూర్తయింది. ఆఖరి దశలో 78 స్థానాలకు నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.