తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 13 సమస్యాత్మక నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది. అవేంటంటే సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

ఈ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో ఒకే విడతలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కంటె 90 నిమిషాలు ముందు అంటే ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: