
టీఎస్పీఎస్సీలు చివరిగా ప్లాన్ చేయడం, తీరా అవి కాస్త రద్దవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా పేపర్ లీకేజ్ ల సమస్య కూడా దీనికి తోడైంది. ఈ సమస్యను ఏదోలా బీజేపీ పై నెట్టేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ నే తిరస్కరించిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే సమస్యకు పరిష్కారం చూపిస్తానంటూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. అదే ఆంధ్రా విషయానికి వస్తే గతంలో నిరుద్యోగాన్ని రూపుమాపుతామంటూ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు.
ఆయన 36 వేల నుండి 40,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది. అయితే ఆయన వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ప్రకటిస్తామని చెప్పినా కూడా అది జరగలేదు. మళ్లీ సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక ప్రతి ఏౕౕడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆరు నెలలు లోపు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుందని ఆయన చెప్పడం జరిగింది.
ఆయన చెప్పినట్టుగానే మొదట ఏడాది లక్షన్నర గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకాన్ని చేపట్టారు. అయతే ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్లు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. అయితే టీచర్ అలాగే పోలీస్ పోస్టులు జగన్ ఇస్తారని నమ్మిన వాళ్లు ఒకరకంగా ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు.