తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఇప్పటికే తెలుగు లో ఎన్నో మూవీ లను నిర్మించి , అందులో భాగంగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాత లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  కియరా అద్వానీ ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు తాజాగా దిల్ రాజు తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తో వారిసు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం పొంగల్ కి తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి అజిత్ సినిమా కూడా విడుదలకు అవుతుంది. కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు విజయ్ మరియు అజిత్ సినిమాలకు తమిళనాడులో సమానంగా థియేటర్ లు ఇవ్వబోతున్నారు అని , తన సినిమాకు కొన్ని ఎక్కువ థియేటర్ లు ఇవ్వమని అడగబోతున్నట్లు దిల్ రాజు తెలిపాడు. కాకపోతే దిల్ రాజు అడిగినప్పటికీ ఈ ఇద్దరు హీరోలకు సమానమైన థియేటర్ లను తమిళనాడులో ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: