లీడర్ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు రానా. ఆ సినిమా అనంతరం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ అలరించాడు.అనంతరం  బాహుబలి సినిమా తర్వాత తన స్పీడు బాగా తగ్గింది అని చెప్పాలి. బాహుబలి 2 సినిమా తర్వాత కేవలం నాలుగైదు సినిమాల్లోనే నటించాడు రానా. ఈ క్రమంలోనే సినిమాల సెలెక్షన్ విషయంలో రానా ఇంత ఆలస్యం చేయడం సినిమా సినిమాకి చాలా గ్యాప్ ఇవ్వడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది అని తెలుస్తుంది. తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా బయటపెట్టాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ సినిమా సినిమాకి మధ్య ఎందుకంత గ్యాప్ ఇస్తున్నాడు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. కెరియర్ మొదట్లో సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలైనా చేసేవాడిని అలా చేయకపోతే జనాలు నన్ను మరిచిపోతారేమో అన్న భయంతో సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేనేంటో యావత్ భారతదేశానికి తెలుసు .కాబట్టి అద్భుతమైన సినిమా చేయాలి అన్న ఆశతో ఉన్నాను. లేదంటే అసలు చేయకూడదు అంటూ చెప్పుకోవచ్చాడు రానా. అందుకే బాహుబలి ఇవ్వండి అంత పెద్ద సినిమా తర్వాత అలాంటి పెద్ద సినిమాలో చేయలేదు.

అందుకే మరోసారి అంత పెద్ద సినిమాలో చేయాలి అంటే కచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తే తప్ప అంతటి సినిమాలో నటించడం కష్టం అంటూ తెలియజేశాడు రానా .ఇదిలా ఉంటే ఇక భారీ అంచనాల నడుమ రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ఫిక్స్ లో మార్చ్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. చాలా గ్యాప్ తర్వాత వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రానా ఈ వెబ్ సిరీస్ ద్వారా రానా ఎంతవరకు నేర్పిస్తారు చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: