
ఇక తర్వాత సినిమాకు సంబంధించిన మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా అదే నెలలో పూర్తి చేయాలని పవన్ ప్లానింగ్ .. పొలిటికల్ కమిట్మెంట్స్ కు ఏమాత్రం డిస్ట్రబ్ అవ్వకుండా సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు డిప్యూటీ సీఎం గారు . ఇదే సమయంలో పవన్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పారన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది .. కోలీవుడ్ యాక్టర్ కం డైరెక్టర్ సముద్రఖనితో సినిమా చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త . అయితే ఇప్పుడు పవన్ మరో సినిమాకి ఒకే చెప్పారన్న వార్తలో ఎలాంటి నిజం లేదని ఆయన టీం అంటుంది .. ఇక గతంలో సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాలో నటించారు పవన్ .. ఆ పరిచయంతోనే సముద్రఖని పవన్ ను కలిశారే తప్ప ఎలాంటి సినిమాకు సంబంధించిన టాక్స్ జరగలేదని పవన్ టీం క్లారిటీ ఇచ్చారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు