
కర్నాటకు చెందిన సిద్దిరామయ్య, ఎస్ఎం కృష్ణ, వీరప్పమొయిలితోపాటు మరికొంతమంది ముఖ్యమంత్రి పదవికి పోటీపడగా సిద్ది రామయ్యకు అన్ని విధాల కలిసివచ్చింది. కాంగ్రెస్ పార్టీలో 75మంది ఎమ్మెల్యేలు సిద్దిరామయ్య నాయకత్వానికి మద్దతుపలుకడంతో ముఖ్యమంత్రి అవకాశం దక్కనుంది. అయితే ఈనెల 13న సిద్దిరామయ్యను సీఎల్ పి నాయకునిగా ఎన్నుకుంటారు. అదే రోజు లేదా మరుసటిరోజున ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.