
గత ప్రభుత్వ పాలనలో లోపాలను, అవినీతిని కాగ్ కడిగిపారేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 2013-14కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై కాగ్ తన నివేదికను వెల్లడించింది. కేటాయింపులు తప్ప.. నిధుల విడుదల, ఖర్చు అంతంతమాత్రమేనిని పేర్కొంది. చేసిన ఖర్చుల్లో కూడా లెక్కాపత్రం లేనివి ఎక్కువేనని వెల్లడించింది. కాగ్ ఎన్నిసార్లు అక్షింతలు వేసినా పాలకులు మాత్రం మారడం లేదు.
అడిట్ జనరల్ (కాగ్) నివేదిక
బడ్జెట్ అంచనాలు అవాస్తవంగా, వ్యయ పర్యవేక్షణ, నియం త్రణ బలహీనంగానూ ఉందని కంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ (కాగ్) నివేదిక వ్యాఖ్యానించింది. 2014 మార్చి నెలతో ముగిసిన సంవత్సరపు రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై కాగ్ ఈ నివేదిక రూపొందించింది. సమైక్య రాష్ట్రంలో రూపొందిన 2013-14 బడ్జెట్‌ను పరిశీలించిన కాగ్ పలు అవకతవకలను, లోసుగులను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించగా, వాస్తవంగా అయిన వ్యయం 1,38612 కోట్ల రూపాయలు మాత్రమేనని తేల్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 11,426 కోట్ల రూపాయల అనుబంధ కేటాయింపులు అనవసరమని పేర్కొంది. శాసనసభ ఆమోదం లేకుండా 2013-14 ఆర్థికసంవత్సరంలో 530 కోట్ల రూపాయల మేర ఖర్చుచేశారని, 2004-15 నుండి ఈ తరహా ఖర్చు 3.141 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది. ఏమాత్రం నిర్ధిష్ట వివరాలు లేకుండా గుంపగత్తుగా రూ.1,703 కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొంది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక
2013-14లో రూ. 3,392 కోట్ల రూపాయల ఖర్చుకు సరైన ఓచర్లుగాని, పత్రాలుగాని లేవని కాగ్ పేర్కొంది. అనుమతులు సకాలంలో రాని కారణంగా గృహనిర్మాణం, నీటిపారుదల, వైద్యం, సంక్షేమ రంగాకు సంబంధించిన పథకాల ఫలితాలు లభ్ధిదారులకు చేరడం లేదని కాగ్ వ్యాఖ్యానించింది. ఏడాది పొడవునా ఖర్చులు సమంగా ఉండాలని, అనవసరపు హడావిడి ఖర్చులు ఉండకూడదని రాష్ట్ర ఫైనాన్షియల్ కోడ్గలోని 39 వ అధికరణం చెబుతుండగా దానికి విరుద్దంగా ఖర్చులు జరిగాయి. ఈ విషయాన్ని కూడా కాగ్ ఎత్తి చూపింది. ఏడాది మొత్తం మీద 17నుండి 30శాతం మేర ఖర్చు చేయగా చివరి త్రైమాసికంలో 34శాతం ఖర్చుచేశారని, ఒక్క మార్చి నెలలోనే 80 నుండి 90శాతం ఖర్చులు కొన్ని శాఖల్లో జరిగాయి. రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. జనాభా ప్రకారం ఉండాల్సిన ప్రాథమిక వైద్యకేంద్రాల్లో దాదాపు 40 నుంచి 52 శాతం పిహెచ్‌సిలు పనిచేయడం లేదన్న విషయాన్ని కాగ్ కనుగొంది. 30 శాతం ఆసుపు్తల్ల్రో ఆపరేషన్ థియేటర్లు, 16 శాతం పిహెచ్‌సిల్లో సౌకర్యాలతో కూడిన ప్రసూతి గదులు లేవని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నిధులతో 200514 మధ్య కాలంలో 1,224 ఉపకేంద్రాలు, 249 పిహెచ్‌సిలను అప్గ్రేడింగ్చేసి సౌకర్యాలు పెంచాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 654 ఉపకేంద్రాలు, కేవలం 114 పిహెచ్‌సిలను మా్తమ్రే ఆధునీకరించారని తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమర్పించిన సమాచారం ప్రకారం 56 శాతం పిహెచ్‌సిల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని వెల్లడించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
రాష్ట్రంలోని 825 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 706 (86 శాతం) సొంత భవనాల్లో, 119 జూనియర్ కళాశాలలు జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలు తదితర భవనాల్లో తరగతులు కొనసాగుతున్నాయని కాగ్ తెలిపింది. మనటివీ కార్యక్రమం ప్రారంభమై ఏడేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో 28 శాతం జూనియర్ కాళాశాలలు టీవీ కార్యక్రమాల ద్వారా టెలీ పాఠాల సదుపాయాన్ని పొందలేకపోయాయని వెల్లడించింది.