ఈ రోజుల్లో చాలామందికి కూడా జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్య రావడం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. అందువల్ల ఈ జుట్టు సమస్యలకు చాలా హెయిర్ ప్యాక్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి హెయిర్ ప్యాక్లను వినియోగిస్తే ఈ సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు పెరుగు, కరివేపాకు వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ను వాడటం వల్ల జుట్టు ఖచ్చితంగా కూడా మెరిసేలా తయారవుతుంది. ఇంకా అంతే కాకుండా తెల్ల జుట్టు సమస్య నుంచి కూడా చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఈ రెండు కూడా కూడా మార్చరైజింగ్ గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి జుట్టును మెరిసేలా కనిపించేందుకు బాగా ఉపయోగపడతాయి.


ఈ రెండిట్లో కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా మంచి పాత్ర పోషిస్తుంది.కాబట్టి పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్ కోసం ముందుగా మీరు ఒక 20 కరివేపాకు ఆకులను తీసుకోవాలి. వాటిని కడిగి మెత్తగా రుబ్బాలి. ఆ తర్వాత అందులో మూడు స్పూన్ల పెరుగు వేసి కలపాలి. పెరుగు ఇంకా కరివేపాకును కూడా మిక్సీలో వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. అలాగే అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కస్టర్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ఒక గంట సేపు తరువాత అప్లై చేసి ఒక గంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో బాగా కడగాలి.ఇలా వారానికి ఖచ్చితంగా రెండు నుంచి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: