
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండ్ లూకియాన్సి పోలండ్ ఉక్రెయిన్ పై మాటల దాడి ని పెంచాడు. రష్యా బెలారస్ లో దాడులు చేసే విధంగా ఇక్కడ తిరుగుబాటు దారులకు ఈ రెండు దేశాలు ఆయుధాలను ఇవ్వాలని చూస్తున్నట్లు ఆరోపించారు. తద్వారా బెలారస్ లో దాడులు జరిగితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలను రష్యా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. దీంతో ఫోకస్ మొత్తం బెలారస్ పై పెడుతుంది. ఇటు ఉక్రెయిన్, అటు బెలారస్ లో యుద్దం చేయాలంటే రష్యాకు ఇబ్బంది అవుతుందని పోలండ్ గ్రహించి ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్లు బెలారస్ అధ్యక్షుడు ఆరోపించారు.
మొత్తం మీద రష్యా, ఉక్రెయిన్ యుద్దం మరిన్ని రోజులు కొనసాగితే పోలండ్ వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అనంతరం పోలండ్ పై రష్యా యుద్దం ప్రకటిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రపంచమే భయపడుతోంది. పోలండ్ నాటో దేశం కాబట్టి ఏ మాత్రం రష్యా పోలండ్ వైపు చూసినా 20 నాటో దేశాలు కలిసి యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధమే వస్తుందని భయపడుతున్నారు. పోలండ్ మాత్రం ఉక్రెయిన్ తర్వాత తమనే పుతిన్ టార్గెట్ చేస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.