సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అంతే కాకుండా నెక్స్ట్ గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నట్లు తండ్రి కృష్ణ బర్తడే మే 31వ తారీఖున సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అందరికీ ఆసక్తి పెంచారు. “అతిధి” సినిమా లుక్ టైపులో లాంగ్ జుట్టు మరియు మెడపై సరికొత్తగా టాటూతో మహేష్ లుక్ ఉండటంతో ఫాన్స్ కూడా సర్ప్రైజ్ అయ్యారు. 
IHG
ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా టైపు లో సినిమాలు చేస్తున్నారు. ఒప్పుకుంటున్న ప్రతి ప్రాజెక్టు ఇతర భాషల్లో రిలీజ్ అయ్యేలా ముందే డైరెక్టర్ తో డీలింగ్ మాట్లాడుకుని సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఇంకా కొంతమంది స్టార్ హీరోలు వారి సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 
IHG' beats 'Dark Knight' on IMDB
ఇటువంటి తరుణంలో మహేష్ బాబు అభిమానులు కూడా మహేష్ పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని, ఇతర బాషలలో రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ప్రాధేయ పడుతున్నారు. పాన్ ఇండియా సినిమా చేయడానికి సరైన కటౌట్ కంటెంట్ కలిగిన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైక హీరో మహేష్ అని పొగుడుతూ, బాబు ఇతర భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ చేయాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: