
చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన చిత్రాల విషయానికి వస్తే.. అప్పట్లోనే హాలీవుడ్ మూవీ గా తెరకెక్కించాలని చూసిన చిత్రం అబూ -బాగ్దాత్ దొంగ .. ఈ చిత్రం కూడా భారీ ఖర్చుతో తెరకెక్కించాలని చూశారు కానీ కొన్ని కారణాల చేత ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది అనే సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం కాస్త షూటింగ్ తో పాటు ఒక సినిమా పాటను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి కొన్ని కారణాల చేత ఈ సినిమా కూడా ఆగిపోయింది.
ఇక ఆ తర్వాత భూలోకవీరుడు సింగీతం శ్రీనివాసరావు డ్రీం ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇక మరొక చిత్రం వజ్రాల దొంగ ఈ చిత్రాన్ని శ్రీదేవి మొదటిసారి తన తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ పైన తెరకెక్కించాలని చూసింది. ఈ సినిమా కోసం ఒక పాట కూడా షూటింగ్ జరిగింది ఈ పాట తరువాత ఈ సినిమా ఆగిపోవడం జరిగింది. ఇలా చిరంజీవి కెరియర్ లో అనుకోకుండా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆగిపోవడం జరిగింది.