ప్రపంచంలో ఎప్పుడైతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలైందో అప్పటి నుంచి కొన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలు ఇంటిపట్టున ఉంటూ వచ్చారు. ఇక పిల్లలను బయటకు పంపకపోవడంతో ఇంట్లోనే వీడియో గేమ్, సెల్ ఫోన్ తో ఆడుకుంటూ వచ్చారు.  అయితే ఇలా పిల్లలు పదే పదే సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఆడటంతో ఉన్న విజ్ఞానం కాస్త పోవడమే కాదు.. లేని పోని కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో 15 ఏండ్ల బాలుడు నిర్విరామంగా వీడియో గేమ్ ఆడి గుండెపోటుకు గురయ్యాడు. స్ట్రోక్ కారణంగా ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం జియాంబిన్ దవాఖానలో వైద్యుల పర్యవేక్షణలో బాలుడు కోలుకుంటున్నాడు.

 

ఆన్ లైన్ తరగతుల నెపంతో తన గదిలెక్కి వీడియో గేమ్ ఆడేవాడు. రోజంతా వీడియోగేమ్ ఆడుతూ ఉండటం వల్ల ఒకరోజు అకస్మాత్తుగా ఇంట్లో పడిపోయాడు. దాంతో తల్లిదండ్రులు బాలుడ్ని సమీపంలోని దవాఖానకు తరలించగా.. స్ట్రోక్ వచ్చినట్లు తేల్చారు. ఎడమ చేయి పూర్తిగా పట్టుదప్పిపోతుండటం వైద్యులు గుర్తించారు.   దాదాపు 22 గంటలపాటు వీడియోగేమ్ ఆడుతున్నాడని తెలుసుకోలేకపోయారు. చివరకు దవాఖాన పాలవడంతో తమ తప్పును తెలుసుకుని ఇప్పుడు చింతిస్తున్నారు.  తల్లిదండ్రులు తమ తనయుడు బాగా చదువుకుంటున్నారన్న భ్రలో ఉండిపోయారు.

 

రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ.. మిగతా కాలం అంతా వీడియో గేమ్ ఆడటానికి కేటాయించడంతో ఆ బాలుడు చేతితోపాటు మెదడకు రక్తం, ఆక్సీజన్ పరిమాణం తగ్గాయని, ఫలితంగా స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తేల్చారు.  బాలుడి ఎడమ చేతి మళ్లీ పనిచేస్తుందా అనేది చెప్పడం కష్టం అని వైద్యులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులు ఇలాగే సెల్ ఫోన్,  వీడియో గేమ్స్ తో ఎక్కువగా ఆడవొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: