దేశంలోనే మొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రైల్వేప్రాజెక్ట్ తెలంగాణ లో ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ఈ మార్గం 392 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టు ఉండబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ ఈ ప్రాజెక్టుని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించుకుంది. ఈ మార్గంలో సుమారుగా 26  రైల్వే స్టేషన్లు కొత్తవి రాబోతున్నాయట. ఇందుకు రూ.12,070 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇందులో భాగంగా (మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలలో ఈ రైలు మార్గం ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.) ఔటర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ విషయానికి వస్తే.. ఆలేరు, గుళ్లగూడ, వలికొండ, మాసాయిపేట, గజ్వేల్ మీదుగా వెళ్లబోతోంది.



సుమారుగా రెండేళ్ల క్రితమే ఇందుకు సంబంధించి రైల్వే శాఖ సర్వే చేసి ఆమోదించారట. ఔటర్ రింగ్ రైలు ప్రతిపాదన 508 కి.మి కాగా..కానీ దక్షిణ మధ్య రైల్వే మాత్రం మూడు ప్రతిపాదనలను తీసుకోవచ్చారు. అందులో ఒకటి 508.45 కి.మి, మరొకటి 511.51 కి.మి, మూడవది 392 కి.మి. వీటిని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రతిపాదనలను చూసి మరి.. మూడవ దానిని పరిగణంలోకి తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఖరారు చేసింది.


392 కి.మి రింగ్ రైలు ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలోనే అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలకు గుర్తించడంతో వీటిని రైల్వే బోర్డుకి పంపించేందుకు సిద్ధమయ్యింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. హైదరాబాద్ చుట్టూ 361 కి. మి మేర rrr రాబోతోంది. వీటికి 3 నుంచి 5 కి.మి దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం 11 కిలోమీటర్లు..

రైల్వే లైన్:
సికింద్రాబాద్ - కాజీపేట
సికింద్రాబాద్ - డోన్
సికింద్రాబాద్ - వాడి
సికింద్రాబాద్ - గుంటూరు
సికింద్రాబాద్-కొత్తపల్లి
సికింద్రాబాద్  - ముద్ఖేడ్

ROR ఏ స్టేషన్ మధ్యలో వస్తుందంటే..
వంగపల్లి-ఆలేరు
బూర్గల- బాలా నగర్
గుళ్లగూడ - చిట్టిగడ్డ
మసాయిపేట - శ్రీనివాస నగర్
వలికొండ - రామన్నపేట
గజ్వేల్- కోడకండ్ల

ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులతో అభివృద్ధి వేగంగా అవుతుందని అలాగే rrr కు రింగు రైలు మార్గాన్ని కూడా దగ్గరలో తీసుకురావడం వల్ల రోడ్డు రైలు మార్గంతో అభివృద్ధి మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: