ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టు ఏది అంటే సగటు ప్రేక్షకులు చెప్పే పేరు ఒకే ఒకటి. అదే ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ టీంకి సాధ్యంకాని రీతిలో తక్కువ సమయంలోనే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. అయితే ఇక ముంబై ఇండియన్స్ అంటే కేవలం ఒక సాదాసీదా ఫ్రాంచైజీ  కాదు అదొక బ్రాండ్ అన్నట్లుగానే మారిపోయింది. ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఈ బ్రాండ్ తన హవా కొనసాగిస్తుంది.


 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అటు భారత మహిళల జట్టు కెప్టెన్ గా ఉన్న హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లో బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీం. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. వరుసగా విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీఫైనల్ లో కూడా అడుగుపెట్టింది. ఇకపోతే ఇటీవల సెమీఫైనల్ లో యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. సాధారణంగా అయితే లీక్ దశలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు నాకౌట్ మ్యాచ్లో ఒత్తిడికి గురై కొన్ని జట్లు ఓడిపోవడం చూస్తూ ఉంటాం.


 ముంబై ఇండియన్స్ విషయంలో కూడా ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 72 పరుగులు తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. 123 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ కు నిర్దేశించగా.. యూపీ మాత్రం 17.4 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 72 పరుగులు తేడాతో విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది ముంబై ఇండియన్స్. ఇక ముంబై జోరు చూస్తే తప్పకుండా ఈసారి టైటిల్ విజేతగా నిలిచేది ఈ జట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl