చికెన్ ను వండేటప్పుడు  చాలా మంది కూడా ఎక్కువగా నూనెను వాడుతూ ఉంటారు. ఎక్కువ నూనెను ఉపయోగించి చేసే చికెన్ ను తినడం వల్ల మేలు కంటే కీడే చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసేలా ఒక్క చుక్క నూనెను వాడకుండా కూడా మనం చికెన్ ను చాలా ఈజీగా ఇంకా అలాగే హెల్తిగా తయారు చేసుకోని తినవచ్చు.ఫస్ట్ ఒక చికెన్ లెగ్ పీసెస్ ను తీసుకుని వాటిని ఒక వైపు నిలువుగా కట్ చేసుకోవాలి.ఆ తరువాత మరో వైపు లోపలి దాకా గాట్లు పెట్టుకోవాలి. తరువాత వీటిని బాగా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు, నిమ్మరసం ఇంకా చికెన్ మసాలా వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో చికెన్ ముక్కలను వేసి ఈ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించాలి. అలాగే తరువాత వీటిని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇక ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత ముక్కలను బయటకు తీసి చల్లదనం పోయే దాకా అర గంట పాటు బయట ఉంచాలి. ఆ తరువాత ఒక ప్లేట్ లో ఉప్పు, కారం, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఇంకా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మ్యారినేట్ చేసుకున్న ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత కళాయిలో రెండు బటర్ పేపర్ లను కూడా ఉంచాలి.


ఇప్పుడు చికెన్ ముక్కలను ఉంచి వాటిపై మరో బటర్ పేపర్ ను కూడా ఉంచాలి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా కళాయిపై మూతను అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఆవిరి మీద అలాగే ఉడికించాలి. ఆ తరువాత మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు అలాగే ఉడికించాలి. ఇంకా తరువాత మూత తీసి ముక్కలను మరో వైపుకు తిప్పి వాటిపై పేపర్ ను ఉంచాలి. ఇప్పుడు నీరంతా పోయే దాకా చిన్న మంటపై మూత పెట్టకుండా ముక్కలను వేయించాలి. ఇలా నీరంతా పోయి ముక్కలు మెత్తగా ఉడకడానికి ఒక 25 నుండి 30 నిమిషాల టైం పడుతుంది.ఈ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఒక్కో ముక్కను తీసుకుని నేరుగా మంటపై ఉంచి దాని చుట్టు కాల్చుకోవాలి. ఇక ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే చికెన్ తయారవుతుంది. ఈ చికెన్ రుచిగా ఇంకా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా కూడా మనం చాలా ఈజీగా రుచికరమైన ఆరోగ్యకరమైన చికెన్ ను తయారు చేసుకోవచ్చు.ఇక ఈ విధంగా తయారు చేసిన చికెన్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: