దేశంలో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. స్వచ్ఛమైన గాలిని పీల్చే పరిస్థితి లేకుండా ఉంది.  ఫ్యాక్టీరలు, వాహనాలు ఇతర వాటి నుంచి వచ్చే పొగ వల్ల గాలి పూర్తిగా కాలుష్యంగా మారిపోతుంది.  కలుషితమైన గాలి నుంచి పచ్చని చెట్లు మనల్ని రక్షిస్తాయి.. కానీ మనిషి స్వార్థంతో చెట్లను కూడా నరికి వేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణలో హరితహారం మొదలైంది.  ప్రతి ఒక్కరూ చెట్లు నాటి తెలంగాణని పచ్చగా మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు.  ఇక రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది సెలబ్రిటీలు, నటులు ,వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది.

 

ఈరోజు గచ్చిబౌలి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో జబర్దస్త్ టీం సభ్యులైన అదిరేఅభి, కెవ్వుకార్తిక్, రాజమౌళి, పొట్టి నరేష్, అప్పారావు, శ్రీమతి లక్ష్మి అప్పారావు ఆరుగురు కలిసి  ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.  ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగానికి ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా గచ్చిబౌలి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో జబర్దస్త్ టీం సభ్యులైన అదిరేఅభి, కెవ్వుకార్తిక్, రాజమౌళి, పొట్టి నరేష్, అప్పారావు, శ్రీమతి లక్ష్మి అప్పారావు ఆరుగురు కలిసి  ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు పెంచడం మనందరి బాధ్యత అని.. ఇప్పడు నాటే మొక్కలు మన ముందు తరాలా వారికి శ్రీరామ రక్షగా ఉంటాయని.. స్వచ్ఛమైన గాలి అందిస్తాయని అన్నారు. మానవాళి లేదని మనము భోజనం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమని రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీన్ని నివారించాలంటే మనందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: