తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ "వారిసు" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా  శ్రీకాంత్ ... సంగీతమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా యొక్క తమిళ వర్షన్ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల కాగా ... తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాక ముందే ఈ మూవీ కి సంబంధించిన ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఫార్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లోనే ఈ సంస్థ ఈ మూవీ ఓవర్ సిస్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: