మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది... దేశానికి వెన్నుముక అన్న రైతన్న వెన్ను విరిచారు పోలీసులు. రాష్ట్రంలోని గుణ జిల్లాలో ఓ దళిత రైతు పండించిన పంటను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆ రైతు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయినా కూడా ఆ అధికారులు రైతు మాట వినలేదు. ఇక తన గోడు వినేవారు ఎవరూ లేరని.. ఆ రైతు పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతు కుటుంబంపై దారుణంగా దాడి చేశారు. 5.5 ఎకరాల స్థలంలో ఓ రైతు కుటుంబం పంట పండిస్తున్నది.  ప్రభుత్వం ఆ స్థలాన్ని కాలేజీ నిర్మాణం కోసం కేటాయించింది. దీంతో రైతులకు, ప్రభుత్వానికి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ రైతు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

IHG

ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ద‌ళిత రైతు కుటుంబంపై బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి స్పందించారు. ఒక రైతుపై ఇంత దాష్టికమా.. సిగ్గు చేటు అని మాయావ‌తి అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను దేశ వ్యాప్తంగా ఖండించ‌డం స‌హ‌జం. కానీ రైతు కుటుంబంపై దాడి చేసిన పోలీసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

 

 దేశంలో అసలే కరోనాతో ప్రజలు ఎంతగా విల విలలాడుతున్నో తెలిసిందే.. ఇలాంటి సమయంలో దేశానికి అన్నం పెట్టే రైతు అని కూడా చూడకుండా అన్యాయంగా పోలీసులు దాడి చేయడం దారణమైన విషయం అన్నారు. ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. రైతుకు న్యాయం చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను తొలగించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: