ఎలాంటి వారికైనా పాము అంటే చచ్చేంద భయం.. ఇది విషంతో కూడుకున్నది.. దాని జోలికి వెళ్లినవారు బతికి బట్ట కట్టడం అసంభవం.  ఈ పాముల్లోనూ భయంకరమైన విషంతో కూడుకున్నవి కూడా ఉంటాయి.. వాటిన భారిన పడితే క్షణాల్లో మరణించడం ఖాయం. ఏపిలో పాములు రెచ్చిపోతుపోతున్నాయి. ఏకంగా జనావాసాల్లోకి విషపర్పాలు చేరుకోవడంతో జనాలు బిక్కుబిక్కు మంటున్నారు. పాములు సాధారణంగా వర్షం కురిస్తే భయటకు వస్తాయి. అయితే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో కృష్ణా జిల్లా పరీవాహక ప్రాంతాల్లో బయటకు వచ్చిన పాములు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ఇటీవల 28 మంది పాముకాటుకు గురై, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. వీరందరికీ పాము విషానికి విరుగుడు వాక్సిన్లు ఇచ్చామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

 

నిన్న ఒక్కరోజే ఆరుగురు ఆసుపత్రికి పాము కాటుతో వచ్చారని చెప్పారు. పాముల బెడద తమకు నిద్రలేకుండా చేస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రసుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడుతున్నాయి.. దాంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే పుట్టలో ఉన్న పాములు జనాల్లోకి వస్తున్నాయి. ఇన్నిరోజులు గుట్టు చప్పుడు లేకుండా ఉన్న...క్రిమి కీటకాలు, పాములు, తేల్లు..ఇతర చల్లటి వాతావరణానికి మెల్లగా బయటకి వస్తుంటాయి..ఇక ఇది ఇలా ఉంటే.. కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పాత కథే పునరావృతమవుతుంది.  

 

పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో ఒకే రోజు ఆరుగురు వ్య‌వ‌సాయ కూలీలను పాములు కాటు వేశాయి. స్థానికులు వెంట‌నే వారిని ఆస్పత్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు తెలిపారు.  ఇకపోతే, వర్షాకాలం కావడంతో పాములు పొలాల్లోకి వస్తున్నాయని, వ్యవసాయ పనులు చేసే రైతుఉల, కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తాచుపాము, కట్లపాము కరిచిన సందర్భాల్లో విష తీవ్రత అధికంగా ఉంటే కాటుకు గురైన వ్యక్తి సృహ తప్పిపోవడం, ఊపిరి అందక శ్వాసతీసుకోవడం కష్టంగా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: