
విషయానికి వస్తే శాసనమండలి మాకు వద్దు. దండుగమారి అంటూ ఏణ్ణర్ధం క్రితం ప్రత్యేక సభ పెట్టి మరీ కసికొద్దీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు అయిన కనకమేడల రవీంద్రకుమార్ మండలి విషయాన్ని ప్రస్తావించి సమాధానాన్ని కావాల్సిన సమాధానాన్నే బహు చక్కగా రాబట్టారు. ఏపీ శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కనకమేడల ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి మరీ వైసీపీకి గట్టి ఝలక్ ఇచ్చారు. అంతే కాదు శాసనమండలిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కిరణ్ రిజిజు వెల్లడించారు. అంటే మా పరిశీలనలోనే ఈ విషయం ఉంది సుమా అంటూ కేంద్రం జగన్ కి చెప్పినట్లుగానే చూడాలి అంటున్నారు.
మండలిలో ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు చాలానే జగన్ భర్తీ చేశారు. మరో పదమూడు ఖాళీలు కూడా ఉన్నాయి. కేంద్రం తమ తీర్మానాన్ని అటకెక్కించిందని వైసీపీ పెద్దలు లోలోపల సంతోషిస్తున్నారు. కానీ టీడీపీ వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని లాగితే అంతే వ్యూహంతో బీజేపీ కూడా జవాబు చెప్పి జగన్ కి బీపీ తెప్పించేసింది అంటున్నారు. మండలి రద్దు అన్నది మా పరిశీలనలో ఉంది అంటే బీజేపీ తలచుకుంటే దాన్ని కధ ముగించేయగలరు. అలాగని వద్దు అని చెప్పాలంటే వైసీపీకి మా చెడ్ద ఇరకాటమే అంటున్నారు. జగన్ ఇపుడేం చేస్తారు. తన వారి కోసం, తన పార్టీలోని ఆశావహుల కోసం మండలి కంటిన్యూ చేయమని కేంద్రాన్ని కోరాలి. జగన్ ఆ విషయం చెబితేనే తప్ప ఈ పరిశీలన అన్నది ఆపరు. అంతవరకూ మండలి మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఇపుడు కేంద్రం రద్దు నిర్ణయం తీసుకుంటే నిజంగానే జగన్ తట్టుకోగలరా. ఏ పదవీ లేకుండా వైసీపీ నేతలు ఉండగలరా. వారి అసంతృప్తిని ఆ పార్టీ తట్టుకోగలదా. మొత్తానికి టీడీపీ గురి చూసి బాగానే కొట్టింది. బీజేపీ కూడా తనదైన శైలిలో ఆడుకుంటోంది అంటున్నారు.