
కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ రాజశేఖర్రెడ్డి అభిమానుల్లో పార్టీలోకి వస్తారని ఆమె చాలా వరకు అంచనా వేసుకున్న సరే ఎక్కడ కూడా ఆ అంచనాలు నిలబడలేదు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కష్టపడటం రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం వంటివి ఆసక్తిని రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో షర్మిల ఎటువంటి రాజకీయ అడుగులు వేస్తారు అనేది కీలకంగా మారింది
తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల పార్టీలో కీలక నాయకులు ఎవరూ రాకపోతే ఆమె మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా నిలబడే అవకాశాలు దాదాపు గా ఉండక పోవచ్చు. కొంతమంది కీలక నాయకులు షర్మిల కు సంబంధించి తెలంగాణలో విమర్శలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు షర్మిల పార్టీ లోకి వచ్చి ఉంటే కచ్చితంగా ఆమెకు మంచి ఉపయోగం ఉండేది అనే మాట కూడా వాస్తవం. కానీ వాళ్లు కూడా పార్టీలోకి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటనేది అర్థం కావడం లేదు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.