టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా ఏంటి.. కెప్టెన్ ఏంటి.. అతనికి అంత సీన్ లేదు అని అనుకున్న వాళ్ళే ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కు మొదటి టైటిల్ అందించిన తర్వాత.. అతన్ని ప్రశంసించడం మొదలుపెట్టారు. గుజరాత్ కి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా సెలెక్ట్ అయిన సమయంలో.. ఆ టీం టాప్ 8 లో ఉంటే అదే గొప్ప అనుకున్నారు అందరూ. కానీ ఎలాంటి అంచనాలు లేని స్థితి నుంచి ఏకంగా గుజరాత్ జట్టును మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలబెట్టాడు హార్థిక్ పాండ్య.



 దీంతో భారత ఫ్యూచర్ కెప్టెన్సీ రేస్ లో అందరిని వెనక్కి నెట్టి మొదటి వరుసలోకి వచ్చేసాడు. ఇప్పటికే తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ కు విశ్రాంతి ఇచ్చిన ప్రతిసారి కూడా సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక రోహిత్ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అతనే అని అందరూ ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టును ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడు వరకు కెప్టెన్ గా ఐపీఎల్లో 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా 20 మ్యాచ్లు పూర్తి చేసుకోగా.. ఇందులో 15 మ్యాచ్లలో విజయాన్ని అందుకున్నాడు.



 ఈ క్రమంలోనే ధోని రోహిత్ లకు సాధ్యం కానీ అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. 20 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచుల్లో కెప్టెన్సీ వహించి ఎక్కువ విజయాల శాతం అందుకున్న కెప్టెన్గా నిలిచాడు హార్థిక్ పాండ్యా. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా విన్నింగ్ పర్సంటేజ్ 75% గా ఉంది అని చెప్పాలి. అయితే ధోని 217 మ్యాచ్ లలో 128 విజయాలతో 58.9 విన్నింగ్ పర్సంటేజ్ తో రెండో స్థానంలో ఉండగా.. 8 సీజన్లలో కెప్టెన్గా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజ్ 56.08 గా ఉండడం గమనార్హం. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ ఏడవ స్థానంలో ఉన్నాడు. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl