TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ విలువల్లో టిసిఎస్ రెండో స్థానాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థల్లో రెండో స్థానంలో నిలిచింది దేశీయ ఐటి దిగ్గజం టిసిఎస్. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన జాబితాలో టాప్ 25 ఐటీ కంపెనీల్లో మరో ఐదు భారత ఐటి సంస్థలకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఐటి దిగ్గజం ఆక్సించర్ అగ్రస్థానంలో ఉంది.ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిలిచింది. అత్యంత విలువైన ఐటి జాబితాలో తొలి మూడు స్థానాల్లో 2 భారత్ కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కంపెనీ  ఐబిఎఫ్ ను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

 ఈటా కంపెనీల బ్రాండ్ విలువను అంచనావేసి బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక వెలువడింది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత విలువైన, పటిష్టమైన ఐటీ సేవల సంస్థగా ఆక్సెంచర్ తన తొలి స్థానాన్ని పదిలం చేసుకుంది. కంపెనీ మొత్తం బ్రాండ్ విలువ తోపాటు ఈ విషయంలో కంపెనీల మధ్య అంతరాన్ని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది. మార్కెటింగ్ కోసం పెట్టుబడులు, వినియోగదారుల సంతృప్తి, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్ వర్గాల్లో కీర్తి, భవిష్యత్   రెవెన్యూ అంచనాలు, బ్రాండ్ పటిష్టత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కంపెనీల బ్రాండ్ విలువను గణిస్తారు. అగ్రశ్రేణి 25 బ్రాండ్ల జాబితాలో విప్రో ఏడవ, హెచ్సిఎల్ ఎనిమిదవ, టెక్ మహేంద్ర 15వ, ఎల్ టిఐ 22వ స్థానాల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి  చెందుతున్న టాప్-10కంపెనీల జాబితాలో ఉండటం విశేషం. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన గ్లోబల్ 500, 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా
వృద్ధి చెందుతున్న ఐటీ బ్రాండ్ గా విప్రో నిలిచింది. అన్ని రంగాల్లో కలిపి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 25 కంపెనీల జాబితాలోనూ విప్రో చోటు దక్కించుకుంది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ లో వార్షిక ప్రాతిపదికన 52 శాతం వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి వల్ల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటీ సేవలు, సాంకేతిక రంగానికి చెందిన సంస్థలు మాత్రం దూసుకెళ్తున్నాయి.


 రిమోట్ వర్కింగ్ లేదా వర్క్ ఫ్రం  హోమ్ అనే యుగం ఇప్పుడు వ్యాపారంలో సాధారణం అయిపోయిందని బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. గత రెండేళ్లలో ఐటీ సేవలు అత్యంత వేగంగా పుంజుకుంటున్నాయి. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డేటా అనలెస్టిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో భారతదేశం పెద్ద పాత్ర పోషించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: