
ఇటీవల కాలంలో సమోసా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అది ఎలా అంటారా ఇటీవల కాలంలో సాయంత్రం సమయంలో స్నాక్స్ గా లేకపోతే ఆకలి వేసినప్పుడు కడుపు నింపే ఆహారంగా కూడా సమోసాను ఎంతో మంది తినడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా హోటళ్లలో సమోసా తినే కస్టమర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా కస్టమర్లకు ఇష్టమైన సమోసా వ్యాపారం చేసి ఇక్కడొక వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా సమోసాలు అమ్మి రోజుకు 12 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఇది నిజంగానే అతను చేసి చూపిస్తున్నాడు.
కేవలం సమోసాలను అమ్ముకుంటూ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు బెంగళూరుకు చెందిన శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్ దంపతులు. రొటీన్ కి భిన్నంగా ఉండాలని 2015లో లక్షల వేతనం వచ్చే ఉద్యోగాలను వదిలేసి మరి సమోసా సింగ్ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు.. బెంగళూరులో మొదలైన వీరి వ్యాపారం.. ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 స్టోర్లు ఉన్నాయి అని చెప్పాలి. వీరు రోజుకి 12 లక్షల చొప్పున ఏడాదికి 45 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పాలి. సమోసా అమ్మిన ఇలా కోటీశ్వరులు కావచ్చా అని ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.