
ఈ మధ్య కాలంలో చాలామంది చపాతీలను డైట్ లో చేర్చుకుంటున్నారు. చపాతీలు తినడం వల్ల హెల్తీగా ఉండటంతో పాటు తినడానికి చపాతీలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అన్నం మానేయాలని లేదా తక్కువగా తినాలని భావించే వాళ్లకు సైతం చపాతీలు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. అయితే చపాతీ కర్రీ విషయంలో భోజన ప్రియులలో భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే.
కొంతమంది ఆలూ కర్రీతో చపాతీ తినడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం పప్పుతో కూడా చపాతీలను ఇష్టంగా తింటారు. ఇంకొందరు అయితే చపాతీలకు కాంబినేషన్ గా నాన్ వెజ్ వంటకాలను ఎంచుకుంటారు. చపాతీలు చేయడానికి సాధారణంగా బయట దొరికే గోధుమ పిండికి బదులుగా ప్యాకేజ్ గోధుమ పిండిని వాడటం మంచిది. బయట దొరికే గోధుమ పిండిలో మైదా మిక్స్ చేస్తారనే సంగతి తెలిసిందే.
మైదా మిక్స్ చేసిన గోధుమ పిండితో చేసిన వంటకాలను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరాకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే నెయ్యి,వెన్నతో చపాతీలను తీసుకోవడం మంచిది కాదని ఈ విధంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉందని వైద్యులు చెబుతున్నారు. వెన్న, నెయ్యితో చపాతీలు రుచిగా ఉన్నప్పటికీ ఇలా తయారు చేసిన చపాతీలు ఆరోగ్యానికి మంచివి కావు.
చపాతీలు మరీ ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చపాతీలు తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని చపాతీలు తింటే మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లకు చపాతీలు ఏ మాత్రం ఆరోగ్యకరం కావని కచ్చితంగా చెప్పవచ్చు. చపాతీలు తినడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.