షారూఖ్ ఖాన్ .. ఈ బాలీవుడ్ బాద్ షా కి హిట్ ఫ్లాపులతో సంబందం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం. కెరీర్ స్టార్టింగ్ నుంచే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న షారూఖ్.. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు .  ఎప్పటికప్పుడు సినిమాల్లో కొత్తగా కనిపించడానికి షారూఖ్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 2007 లో  ఓం  శాంతి ఓం సినమాలో  దర్ద్ దే దిల్  పాటల షారూఖ్ ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించాడు.

 

సెన్సేషన్ అయిన ఈ పాట దెబ్బకి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. సినిమా కోసం, స్పెషల్లీ తన ఫ్యాన్స్ ని ఖుష్ చెయ్యడం కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు షారూఖ్ అని అనుకున్నారు అంతా. కానీ షారూఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీ చేసింది తన కొడుకు ఆర్యన్ ఖాన్ కోసం అవును కొడుకు ఆర్యన్ ఖాన్ పంతం నెగ్గించడానికే సిక్స్ ప్యాక్ చేశాడు షారూఖ్.

 

తన 9 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కి పెద్ద ఇన్ సల్ట్ అది. తన కళ్లముందే తన తండ్రిని స్టార్ హీరో షారూఖ్ ని.. మీ నాన్న అస్సలు ఏం బావుండడు, యాక్టింగ్‌ రాదు, లావుగా ఉంటాడు అని కామెంట్ చేసింది ఓ  అమ్మాయి. అది విన్న ఆర్యన్.. అప్పుడే ఆ అమ్మాయితో గొడవపడ్డాడు. చెంపచెళ్లు మనిపించాడు .  తర్వాత షారూఖ్ తో .. నాన్నా .. నువ్వు బావుంటావ్, హ్యాండ్సమ్ గా ఉంటావ్ , నీ యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది అది నాకు తెలుసు. కానీ నువ్వు  లావుగా ఉన్నావ్ నాన్నా అన్నాడట ఆర్యన్. అంతే ఆ దెబ్బకి షారూఖ్ ఖాన్.. కొడుకు కోసం , కొడుకు కళ్లల్లో ఆనందం కోసం కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: